Telugu Global
Cinema & Entertainment

Committee Kurrollu | చిన్న సినిమాకు మెగా ప్రచారం

Chiranjeevi - కమిటీ కుర్రాళ్లు సినిమాకు చిరంజీవి ప్రచారం చేస్తున్నారు. నిహారిక నిర్మించిన సినిమా ఇది.

Committee Kurrollu | చిన్న సినిమాకు మెగా ప్రచారం
X

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది.

ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి లాంటి వారు గెస్టులుగా వచ్చారు.

ఇదే వేదికపై చిరంజీవి వీడియోను కూడా ప్రసారం చేశారు. కమిటీ కుర్రాళ్లు సినిమాకు ప్రచారం కల్పించేందుకు చిరంజీవి ముందుకొచ్చారు. పారిస్ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే నిహారిక కోసం, సినిమా చూశారు. ఆ వెంటనే వీడియో విడుదల చేశారు.

"మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఆగస్ట్ 9న రాబోతోంది. ఆల్రెడీ నేను ఈ చిత్రాన్ని చూశాను. చాలా బాగుంది. మా నిహారిక మల్టీటాలెంట్. మంచి చిత్రాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది. మంచి కథ, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ చిత్రం గోదావరి చుట్టు పక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. యదు వంశీ గారికి ఇది మొదటి చిత్రం. అందరూ కొత్త వాళ్లు నటించారు. మంచి విజువల్స్ ఉంటాయి.అనుదీప్ సంగీతం బాగుంది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్"

ఇలా నిహారిక సినిమా కోసం ప్రచారం చేశారు చిరంజీవి. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా కోసం సిద్ధమైన గెటప్ తోనే ఆయన కమిటీ కుర్రాళ్ల కోసం వీడియో చేశారు. చిరంజీవి లుక్ బాగుంది.

First Published:  6 Aug 2024 3:59 PM GMT
Next Story