Chiranjeevi | అయోధ్యకు చిరంజీవి
Chiranjeevi - అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాల్సిందగా చిరంజీవికి ఆహ్వానం అందింది.
జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో దేశమంతా గొప్ప భావోద్వేగ స్థితిలో ఉంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దేశవ్యాప్తంగా 2 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు. ఇప్పుడీ ఆహ్వానం చిరంజీవికి కూడా అందింది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ "అయోధ్యలో రామాలయ నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్టాపన వందల సంవత్సరాల నిరీక్షణకు కార్యరూపంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం గొప్ప అదృష్టం. ఈ ఆహ్వానాన్ని నాకు అందజేసిన రామ జన్మభూమి ట్రస్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత గొప్ప కార్యక్రమానికి నేను సతీసమేతంగా హాజరు అవుతున్నాను" అన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి మొదటి ఆహ్వానాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. చిరంజీవితో పాటు అభిషేక్ అగర్వాల్ లాంటి మరికొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందించారు. రామ్ చరణ్ కు కూడా అహ్వానం అందించారు. అయితే ఆయన హైదరాబాద్ లో లేడు. అయితే ఆహ్వానంపై చరణ్ స్పందించాడు. కుటుంబంతో కలిసి అయోధ్యకు వస్తానని తెలిపారు.