Chiranjeevi: చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
Chiranjeevi: చరణ్ నటన గురించి ఏకంగా జేమ్స్ కామెరూన్ ప్రశంసించడంపై చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. రామ్ చరణ్ గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఒక అద్భుతమని హాలీవుడ్ దిగ్గజ దర్శకులు, నటీనటులు ప్రశంసలు వ్యక్తం చేశారు. హాలీవుడ్లో ప్రతిష్టాత్మక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ఆర్ఆర్ఆర్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంతేకాదు ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్‌లో రామరాజు పాత్రను పోషించిన రామ్ చరణ్‌పై ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేస్తూ రామ్ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందంటూ పేర్కొన్నారు.
చరణ్ నటన గురించి ఏకంగా జేమ్స్ కామెరూన్ ప్రశంసించడంపై చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. రామ్ చరణ్ గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన చిరంజీవి ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 'ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ పోషించిన రామ్ పాత్రను జేమ్స్ కామెరూన్ సర్ ప్రస్తావిస్తూ మాట్లాడడం నాకెంతో సంతోషంగా కలిగించింది. గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ అయిన ఆయన అభిప్రాయం ముందు ఆస్కార్ అవార్డు కూడా చిన్నదే.
రామ్ చరణ్ ఇంత ఎత్తుకు ఎదిగాడా.. అని ఒక తండ్రిగా నేనెంతో గర్వపడుతున్నా. కామెరూన్ అభినందనలే చరణ్‌కు దీవెనలు. బంగారు భవిష్యత్తుకు మెట్లు' అని చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్‌కు అభినందనలు తెలుపుతూ మెగా ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.
Sir @JimCameron an acknowledgement of his character in #RRR from a Global Icon & Cinematic Genius like you is no less than an Oscar itself! It’s a great honor for @AlwaysRamCharan As a father I feel proud of how far he’s come. Ur compliment is a blessing for his future endeavours pic.twitter.com/jof3Q9j0pA
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2023