Telugu Global
Cinema & Entertainment

Mega 156 | కూతురు సుశ్మిత నిర్మాతగా చిరంజీవి సినిమా

Chiranjeevi - భోళాశంకర్ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాపై క్లారిటీ వచ్చింది. కూతురు నిర్మాతగా చిరు సినిమా చేయబోతున్నారు.

Mega 156 | కూతురు సుశ్మిత నిర్మాతగా చిరంజీవి సినిమా
X

మెగా పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నెక్ట్స్ మూవీ డీటెయిల్స్ బయటకొచ్చాయి. చిరంజీవి 156వ సినిమా ప్రకటన వచ్చేసింది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి తన తదుపరి సినిమాను ప్రారంభించబోతున్నారు. చిరంజీవి కుమార్తె సుశ్మిత ప్రారంభించిన బ్యానర్ ఇది.

ఈ బ్యానర్ పై ఇప్పటికే ఆమె పలు వెబ్ సిరీస్ లు, ఓ చిన్న సినిమా నిర్మించాడు. ఇప్పుడు ఏకంగా చిరంజీవితో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు కల్యాణకృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఆ విషయాన్ని ఈరోజు ప్రకటించలేదు. త్వరలోనే దర్శకుడి పేరును ఎనౌన్స్ చేస్తామని మాత్రమే ప్రకటించి ఊరుకున్నారు.

మలయాళంలో హిట్టయిన బ్రో డాడీ సినిమాను చిరంజీవి రీమేక్ చేస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు ఈ సినిమాకు కల్యాణకృష్ణ చాలా మార్పులు చేశారు. ఇదే ప్రాజెక్టును సుశ్మిత ప్రకటించాల్సి ఉంది.

కానీ భోళాశంకర్ ఫ్లాప్ తో రీమేక్స్ పై చిరంజీవి డైలమాలో పడ్డారు. అందుకే కల్యాణకృష్ణ పేరును ఎనౌన్స్ చేయలేదని తెలుస్తోంది. సో.. సుశ్మిత నిర్మాతగా కల్యాణకృష్ణ సినిమా ఉంటుందా లేక మరో దర్శకుడి పేరును ఎనౌన్స్ చేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ప్రకటించింది సదరు నిర్మాణ సంస్థ.

First Published:  22 Aug 2023 8:13 PM IST
Next Story