అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసుల నోటీసులు
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారంలో పోలీసులు అల్లు అర్జున్‌ను ప్రశ్నించనున్నారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అల్లు అర్జున్‌తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. బన్నీ ఏ11 నిందితుడిగా పేర్కొన్నారు.ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కూడా పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబరు 13న ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను తెలంగాణ హైకోర్టె మంజూరు చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. తొక్కిసలాట ఘటనపై మరింత లోతుగా విచారించే అవకాశముంది.