Ram Charan, Upasana: తండ్రి అయిన రామ్ చరణ్
RamCharan and Upasana welcome a Baby Girl - రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

హీరో రామ్ చరణ్ తండ్రి అయ్యాడు, చిరంజీవి తాత అయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణెదల ఈరోజు పండటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అపోలో హాస్పిటల్ నిర్థారించింది. తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నట్టు ప్రకటించింది.
నిన్న సాయంత్రమే ఉపాసన, అపోలో హాస్పిటల్ కు చేరుకుంది. రామ్ చరణ్ కూడా ఆమెతో పాటే ఉన్నాడు. ఈరోజు ఉదయం, అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలో పాపకు జన్మనిచ్చింది ఉపాసన.
ఉపాసన గర్భందాల్చినప్పట్నుంచి మెగా కాంపౌండ్ లో ఆనందం కనిపించింది. ముందుగా ఈ విషయాన్ని చిరంజీవి ప్రకటించారు. ఆ తర్వాత ఉపాసన శ్రీమంతాన్ని గ్రాండ్ గా చేశారు. గర్భంతో ఉంటుండగానే ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి హాజరైంది ఉపాసన.
ఇలా తన బేబీ బంప్ తో అందర్నీ ఆకర్షించిన ఉపాసన, ఈరోజు పాపకు జన్మనిచ్చింది. ఉపాసన, రామ్ చరణ్ పెళ్లి చేసుకొని, మొన్నటితో 11 ఏళ్లు పూర్తయింది. ఇన్నాళ్లకు ఈ జంట తమ జీవితాల్లోకి సంతానాన్ని ఆహ్వానించింది.