Telugu Global
Cinema & Entertainment

Chandini Chowdary | పోలీస్ గా మారిన చాందిని

Chandini Chowdary - ఇన్నాళ్లూ క్యూట్ గా కనిపించిన చాందినీ చౌదరి, పోలీస్ గా మారింది. 'ఆడాళ్లా మజాకా' అంటోంది.

Chandini Chowdary | పోలీస్ గా మారిన చాందిని
X

చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యేవమ్‌'. వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్రంలో చాందిని చౌదరి నటిస్తున్న పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు.

మహిళా సాధికారికతను చాటి చెప్పే విధంగా ఇందులో చాందినీ చౌదరి పాత్ర ఉంటుంది. 'ఆడపిల్లని అయితే ఏంటంటా?' అనే క్యాప్షన్ తో విడుదల చేసిన ఫస్ట్ లుక్ బాగుంది. ఈ చిత్రంలో చాందిని చౌదరి నటన హైలైట్‌గా ఉంటుందంటున్నాడు దర్శకుడు ప్రకాష్.

కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నెరేషన్‌తో ఈ సినిమా వస్తోంది. చాందినీ చౌదరి ఇప్పటివరకు ఎన్నో పాత్రలు పోషించింది. ఆమె ఇండస్ట్రీకొచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. అయితే ఇలా ఓ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేయడం ఆమెకు ఇదే తొలిసారి. ఈ సినిమాతో ఆమె కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోంది.

First Published:  27 April 2024 3:56 PM IST
Next Story