Telugu Global
Cinema & Entertainment

పెళ్లి పనుల్లో చైతూ శోభిత బిజీ..ఫోటోలు వైరల్

టాలీవుడ్‌లో హీరో నాగ చైతన్య- నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు షురూ అయ్యాయి. వైజాగ్‌లోని శోభిత ఇంటిలో గోధుమ రాయి పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు.

పెళ్లి పనుల్లో చైతూ శోభిత బిజీ..ఫోటోలు వైరల్
X

టాలీవుడ్‌లో హీరో నాగ చైతన్య- నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు షురూ అయ్యాయి. వైజాగ్‌లోని శోభిత ఇంటిలో గోధుమ రాయి పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీరి మ్యారేజ్ డిసెంబర్ మొదటి వారంలో జరగనుంది.ఎరుపు రంగు, గోదుమ వర్ణం పట్టు శారీలో శోభితా దూళిపాళ్ల మెరిసిపోతూ కనిపించారు.

ఈమె చేసిన పోస్ట్ పై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లి ఎప్పుడు..? ఎక్కడో చెప్పాలని వరుసగా పోస్ట్ లు చేస్తున్నారు. నాగ చైతన్య, సమంతతో విడాకుల తర్వాత తర్వాత చైతన్య, శోభితలు లవ్‌లో పడ్డారు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఫొటోలు చక్కర్లు కొట్టాయి. దీంతో, ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఈ వార్తలు నిజమేనని నిరూపిస్తూ.. గత ఆగస్టు 8న వీరు నిశ్చితార్థం చేసుకున్నారు.

First Published:  21 Oct 2024 11:00 AM GMT
Next Story