Mothers Day | మదర్స్ డే మార్మోగిపోయింది
Mothers Day - మదర్స్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు తారలు. వీడియోలు, ఫొటోలతో హోరెత్తించారు.
ఓవైపు ఎన్నికల ఫీవర్, మరోవైపు ఐపీఎల్ ఊపు కొనసాగుతున్నప్పటికీ మదర్స్ డే కూడా తన మార్క్ చూపించింది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలంతా మదర్స్ డేను ప్రత్యేకంగా జరుపుకున్నారు. తమ తల్లులతో దిగిన ఫొటోల్ని విడుదల చేసి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
వరుణ్ తేజ్, నాగచైతన్య, రామ్ చరణ్, నితిన్, నాని లాంటి హీరోలు తమ తల్లులతో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాని తన తల్లి ఒడిలో తల పెట్టి ఊయల ఊగే వీడియోను షేర్ చేసి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు.
ఇక విఘ్నేష్ శివన్, నయనతార కూడా తమదైన శైలిలో మదర్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. విఘ్నేష్ శివన్ తన తల్లిని కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేయగా.. ఓ తల్లిగా నయనతార తన కొడుకుతో చేసిన చిలిపి పనుల్ని వీడియోగా తీసి విడుదల చేసింది.
ఇక ఉపాసన, దియా మీర్జా, అలియా భట్, నమ్రత, అనుష్క శర్మ, సమీరా రెడ్డి లాంటి చాలామంది హీరోయిన్లు ఈ మదర్స్ డేను సోషల్ మీడియాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సృష్టిలో తల్లి ప్రేమను మించింది లేదంటూ అందరూ కామన్ గా పోస్టులు పెట్టారు
ఇక ఎప్పట్లానే రామ్ గోపాల్ వర్మ, ఈ మదర్స్ డే రోజున తనదైన విశ్లేషణ ఇచ్చాడు. "ఓ మంచి కొడుక్కి పుట్టిన చెడ్డ కొడుకుని నేను. కాబట్టి నాలాంటి చెడ్డ కొడుకుని కన్న నా మంచి తల్లిని నేను బ్లేమ్ చేయాలా? సమాజంలో చెడ్డ వ్యక్తులుగా ఉన్న వ్యక్తుల తల్లులందర్నీ అన్-హ్యాపీ మదర్స్ డే చెబుతున్నాను." అంటూ పోస్ట్ పెట్టాడు.