జానీ మాస్టర్ ఇష్యూలో బన్నీ..నిర్మాత ఏమన్నారంటే ?
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై రేపటికి వాయిదా పడింది. ఆయనకు మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు కోరారు.
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై రేపటికి వాయిదా పడింది. ఆయనకు మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు కోరారు. పోక్స్ కేసు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. తనకు బెయిల్ మంజురు చేయాలని జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేశారు. మరో వైపు దీనిపై పుష్ప 2 మూవీ నిర్మాత రవిశంకర్ స్పందించారు. జానీ మాస్టర్, ఆ అమ్మాయి మధ్య వారి వ్యక్తిగత ఇష్యు అని నిర్మాత తెలిపారు.
పుష్ప 2 సినిమాకి మొదటి నుంచి వర్క్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ గొడవలో అల్లు అర్జున్‌కు ఏమి తెలియదని రవిశంకర్ చెప్పారు. కొందరు ఏదో రూమార్స్ క్రియాట్ చేస్తున్నారని తెలిపారు. జానీని ఆపేసి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలని ఏమి అనుకోలేదని క్లారిటి ఇచ్చారు. బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 షూటింగ్ జరుపుకుంటోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. వాస్తవానికి ఆగస్టు 15నే విడుదల కావాల్సివున్న ఈ సినిమా పవన్ కల్యాణ్ అభిమానులతో ఉన్న విభేదాలవల్ల, జరిగిన గొడవల్ల డిసెంబరు ఆరుకు నిర్మాతలు వాయిదా వేశారని తెలుస్తోంది. జానీ మాస్టర్‌తో స్పేషల్ సాంగ్ చేద్దామనేలోపంలో ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు. ఇంకా మరో రెండు పాటలు చేయాల్సి ఉందని ఆ అమ్మాయి మూవీలో పనిచేస్తాదని నిర్మాత క్లారిటీ ఇచ్చారు