Brahmanandam Son Engagement: బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లికి రెడీ
Brahmanandam Son Engagement: బ్రహ్మానందం రెండో కొడుకు పేరు సిద్దార్థ్. ఇతడి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.

Brahmanandam: బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లికి రెడీ
హాస్యనటుడు బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు అనే విషయం చాలామందికి తెలియదు. ఆయన పెద్ద కొడుకు గౌతమ్. నటుడిగా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు చిన్నకొడుకు కూడా తెరపైకొచ్చాడు. బ్రహ్మానందం చిన్నకొడుకు పేరు సిద్దార్థ్.
చిన్నకొడుక్కి పెళ్లి కుదిరింది. ఐశ్వర్యతో సిద్దార్థ్ ఎంగేజ్ మెంట్ పూర్తయింది. ఐశ్వర్యగా వృత్తిరీత్యా డాక్టర్. ఇక సిద్దార్థ్ విషయానికొస్తే, అతడు విదేశాల్లోనే చదువుకొని, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. సిద్దార్థ్-ఐశ్వర్య నిశ్చితార్థానికి అలీ, సుబ్బరామిరెడ్డి లాంటి ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి తేదీని త్వరలోనే వెల్లడిస్తారు. ప్రస్తుతం సిద్దార్థ్-ఐశ్వర్యల నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉన్నారు. పెద్దగా ఇబ్బంది పడకుండా చేసే చిన్న చిన్న గెస్ట్ రోల్స్ కు మాత్రమే ఆయన ఓకే చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే, ఆయన తన కెరీర్ కు రిటైర్మెంట్ ఇచ్చేసినట్టే. ఇక గౌతమ్ విషయానికొస్తే, పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యాడు. కానీ స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయారు.