Telugu Global
Cinema & Entertainment

Ilayaraja - మరోసారి కలిసిన ఇళయరాజా, పెద్ద వంశీ

Ilayaraja Director Vamsi - వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. ఓ చిన్న హీరో కోసం ఇప్పుడీ ఇద్దరూ కలిశారు.

Ilayaraja - మరోసారి కలిసిన ఇళయరాజా, పెద్ద వంశీ
X

తెలుగులో చాలా తక్కువగా వర్క్ చేస్తుంటారు ఇళయరాజా. రీసెంట్ గా కస్టడీ సినిమాకు వర్క్ చేశారు. ఇప్పుడు మరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది చాలా చిన్న సినిమా. అయినప్పటికీ ఇళయరాజా అంగీకరించడంతో, అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

సాయిరాం శంకర్ హీరోగా విఎన్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా రాబోతోంది. ప్రకాష్ జూరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సంగీతం అందించడానికి రెడీ అయ్యారు ఇళయరాజా.

90‘s లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా విలేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా వస్తోంది. ఈ కథ ఇళయరాజాకు బాగా నచ్చింది. అందుకే సంగీతం అందించడానికి అంగీకరించారు.

మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం మేజర్ హైలెట్. దీనికి మరో హైలెట్ కూడా ఉంది. ఈ చిత్రానికి పెద్ద వంశీ (డైరెక్టర్) లిరిక్స్ అందించడం మరో విశేషం. గతంలో వంశీ-ఇళయరాజా కాంబోలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో క్లాసిక్స్ లాంటి సాంగ్స్ వీళ్ల కాంబినేషన్ లో వచ్చాయి. అలాంటి వీళ్లిద్దరూ కలిసి సాయిరామ్ శంకర్ సినిమాకు వర్క్ చేయడం పెద్ద హైలెట్.

First Published:  24 May 2023 11:25 AM IST
Next Story