Telugu Global
Cinema & Entertainment

Bookmyshow | 2023 లో బుక్ మై షో హిట్!

Bookmyshow | సినిమాల సంగతెలా వున్నా ‘బుక్ మై షో’ పాపులర్ సినిమా ఆన్ లైన్ బుకింగ్ యాప్ కంపెనీ 2023 ఆర్ధిక సంవత్సరంలో జాక్ పాత్ కొట్టింది.

Bookmyshow | 2023 లో బుక్ మై షో హిట్!
X

సినిమాల సంగతెలా వున్నా ‘బుక్ మై షో’ పాపులర్ సినిమా ఆన్ లైన్ బుకింగ్ యాప్ కంపెనీ 2023 ఆర్ధిక సంవత్సరంలో జాక్ పాత్ కొట్టింది. రూ. 85 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది బుక్ మై షో కి బ్లాక్‌బస్టర్ సంవత్సరం. మొత్తం నిర్వహణ ఆదాయంలో 66 శాతంగా వున్న కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం టిక్కెట్ అమ్మకాల ద్వారా 2023 ఆర్ధిక సంవత్సరంలో రూ. 648 కోట్లకు చేయింది. ఆర్ధిక సంవత్సరం 2022 లో సాధించిన రూ. 227 కోట్ల నుంచి 2.85 రెట్లు పెరిగింది. గత ఆర్ధిక సంవత్సరం రూ. 92 కోట్ల నష్టంతో వున్న కంపెనీ ఈ ఆర్ధిక సంవత్సరం రూ. 85 కోట్లు లాభం గడించడం విశేషం.

లైవ్ ఈవెంట్‌లు, సినిమా టిక్కెట్ల విక్రయాలు బుక్ మై షో రెండు ప్రధాన వ్యాపారాలు. ఈ రెండూ కోవిడ్ మహమ్మారి రెండేళ్ళ కాలంలో లో కఠిన సవాళ్ళని ఎదుర్కొన్నాయి. ఫలితంగా జూన్ 2021లో 200 మంది ఉద్యోగుల్ని తొలగించక తప్పలేదు. మహమ్మారి బారిన పడిన 2021 సంవత్సరంలో మల్టీప్లెక్సుల, లైవ్ ఈవెంట్‌ల మూసివేత కారణంగా కంపెనీ ఆదాయం రూ. 74 కోట్లకు క్షీణించింది.

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్థిక నివేదికల ప్రకారం, 2023 లో థియేటర్‌లకి తిరిగి వచ్చిన ప్రేక్షకులతో, లైవ్ ఈవెంటల అధిక డిమాండ్‌తో, బుక్‌మైషో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 3.5 రెట్లు పెరిగి, రూ. 976 కోట్లకు చేరుకుంది. 2022లో ఇది రూ. 277 కోట్లుగా ఉంది.

2022 క్యాలెండర్ సంవత్సరంలో దేశంలోమొత్తం బాక్సాఫీసు ఆదాయం రూ. 10, 637 కోట్లకి చేరుకుంది. ఇది 2019లో కోవిడ్‌ కి ముందు ఆదాయం రూ. 10,948 కోట్లతో దాదాపుగా సరిపోలింది. 2023 సంవత్సరం బాక్సాఫీసుకి రికార్డు -బ్రేకింగ్ సంవత్సరంగా అంచనా వేశారు. ఆదాయం రూ. 12, 000 కోట్లకు చేరువైంది.

మొత్తం నిర్వహణ ఆదాయంలో 66 శాతంగా వున్న కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం సినిమా టిక్కెట్ అమ్మకాల నుంచి వచ్చింది. ఇది 2023 ఆర్ధిక సంవత్సరంలో రూ. 648 కోట్లకు చేరుకుంది. 2022 ఆర్ధిక సంవత్సరంలో రూ. 227 కోట్లుగా వుంది. అంటే 2.85 రెట్లు పెరిగింది. లైవ్ ఈవెంట్‌ల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయమైన వృద్ధిని సాధించింది. 2023 లో ఇది రూ. 237 కోట్లకు చేరుకుంది. అంటే 9.5 రెట్లు గణనీయంగా పెరిగింది.

ప్రకటనలు, మార్కెటింగ్, స్ట్రీమింగ్, ఆహార పానీయాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతో కలిపి 2023 లో కంపెనీ మొత్తం రూ. 1026 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. ఖర్చు ఖాతా చూస్తే, కంపెనీకి ప్రధాన వ్యయం థియేటర్ యజమానులకి చెల్లించే కమీషన్ ప్రధానమైనది. ఇది మొత్తం వ్యయంలో 31.3 శాతం. కంపెనీ ఖర్చులు 2022 లో రూ. 120 కోట్ల నుంచి రూ. 295 కోట్లకు 2.4 రెట్లు పెరిగాయి. 2023లో మొత్తం వ్యయం రూ. 941 కోట్లుగా వుంటే, 2022 లో రూ. 395 కోట్ల నుంచి ఇది 2.38 రెట్లు పెరుగుదల.

బుక్ మై షో సినిమాలు, లవి ఈవెంట్లే కాక, క్రీడలు, నాటకాలు, కచేరీలు వంటి కార్యక్రమాలకు ఆన్ లైన్ లో లో టికెట్లని విక్రయించే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్‌లలో ఒకటి. 2007లో దీన్ని కంపెనీ సీఈఓ హేమ్రజనీ ప్రారంభించాడు. ఇంటర్నెట్ లోకి వెళ్ళి సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు లేదా కచేరీల కోసం టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని కొన్నేళ్ళ క్రితం ఎవరూ అనుకోలేదు. దీన్ని ఆశిష్ హేమ్రజనీ సుసాధ్యం చేశాడు. అతను వెబ్‌సైట్‌ ని, తర్వాత 'బుక్‌మై షో' యాప్‌ నీ రూపొందించాడు. వీటి ద్వారా మనమిప్పుడు ఇంటిదగ్గర్నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 650 లకి పైగా పట్టణాల్లో అవుట్‌లెట్స్ ని కలిగి వున్న ఈ కంపెనీ లక్షల కొద్దీ వినియోగదారులకి సాటిలేని వినోద అనుభవాలని అందిస్తోంది. 6,000 లకి పైగా స్క్రీన్‌లలో ప్రదర్శించే సినిమాలకి టికెట్లని విక్రయించే సేవల్ని అందిస్తోంది. ఈ రంగంలో ఇంకా పేటీఎం, టికెట్ న్యూ, జస్ట్ టికెట్స్, ఫిల్మీ బీట్, ఐఎండిబి, స్పైసీ ఆనియన్ మూదలైన యాప్స్ పోటీ పడుతున్నాయి. అగ్రస్థానం బుక్ మైషో దే!

First Published:  10 Dec 2023 8:46 AM GMT
Next Story