Telugu Global
Cinema & Entertainment

WAR 2 | ఎన్టీఆర్ బోట్ ఛేజింగ్

WAR 2 - ఎన్టీఆర్-హృతిక్ కలిసి చేస్తున్న సినిమా వార్-2. ఇందులో వీళ్లిద్దరి మధ్య అదిరిపోయే బోట్ ఛేజింగ్ సీన్ ఉంది.

WAR 2 | ఎన్టీఆర్ బోట్ ఛేజింగ్
X

వార్-2లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు దేవర సినిమా సెట్స్ పై ఉన్నప్పటికీ, మరోవైపు వార్-2 కోసం కాల్షీట్లు కేటాయించాడు తారక్. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తవ్వగా, కొత్త షెడ్యూల్ కోసం మరోసారి కాల్షీట్లు కేటాయించాడు గాడ్ ఆఫ్ మాసెస్.

ఇదిలా ఉండగా, ఈ సినిమా కోసం చాలా పెద్ద రిస్క్ చేశాడట ఎన్టీఆర్. సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం స్పీడ్ బోట్ ఛేజింగ్ సీన్ తీశారట. 6 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో హృతిక్-ఎన్టీఆర్ పై ఈ స్పీడ్ బోట్ ఛేజింగ్ సన్నివేశాలు తెరకెక్కించారు.

ఈ యాక్షన్ సీన్ ను డిజైన్ చేయడానికి యూనిట్ కు 3 నెలల టైమ్ పట్టిందంట. దక్షిణాఫ్రికా యాక్షన్ కొరియోగ్రాఫర్ ఫ్రెంజ్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తిచేశారు. ఇప్పటివరకు హాలీవుడ్ లో మాత్రమే కనిపించిన ఈ తరహా యాక్షన్ సీక్వెన్స్ ను తొలిసారి ఇండియన్ స్క్రీన్స్ కు పరిచయం చేయబోతున్నారు.

చాలా రిస్క్ తో కూడిన ఈ సన్నివేశాల్ని, కట్టుదిట్టమైన భద్రత మధ్య తెరకెక్కించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ అనదగ్గ 11 మంది యాక్షన్ కొరియోగ్రాఫర్లను తీసుకున్నారు. బోట్ ఛేజ్ సీన్ తో పాటు, సినిమాలో వచ్చే ఓ కత్తి యుద్ధం ఎపిసోడ్ కూడా హైలెట్ గా ఉంటుందట.

First Published:  25 Jun 2024 3:35 PM GMT
Next Story