Telugu Global
Cinema & Entertainment

నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే బసన గౌడ పాటిల్ అసభ్య వ్యాఖ్యలు చేశారు.

నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన సినీ నటి రన్యా రావుపై కన్నడ బీజేపీ కన్నడ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె శరీరంలోని అంగాంగంలో ప్రతీ చోట బంగారం పెట్టుకొని స్మగ్లింగ్ చేసిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మంత్రుల పేర్లను శాసన సభ సమావేశాల్లో వెల్లడిస్తానని చెప్పారు. ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రన్యా రావు సవతి తండ్రి, కర్ణాటకకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి కె. రామచంద్రరావును ప్రభుత్వం సెలవుపై పంపింది. రామచంద్రరావు కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆయనను సెలవుపై పంపడానికి గల కారణాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఆయన డీజీపీ హోదాలో ఉన్నందున ఈ కేసును ప్రభావితం చేసే అవకాశాలున్నాయన్న కారణంతోనే తప్పనిసరి సెలవుపై పంపినట్టు తెలుస్తోంది.

First Published:  17 March 2025 2:30 PM IST
Next Story