Bipasha Basu: మరో హీరోయిన్ తల్లయింది
బిపాసా బసు తల్లయింది. తనకు కూతురు పుట్టినట్టు ప్రకటించింది. అంతేకాదు, పాపకు పేరు కూడా పెట్టింది.
BY Telugu Global13 Nov 2022 10:41 AM IST

X
Telugu Global Updated On: 13 Nov 2022 10:41 AM IST
మరో హీరోయిన్ తల్లయింది. మొన్నటికిమొన్న హీరోయిన్ అలియాభట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ లిస్ట్ లోకి సీనియర్ హీరోయిన్ బిపాస బసు కూడా చేరింది. తాజాగా బిపాసా బసు తల్లయింది. ఈమె కూడా ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నారు.
తమకు బిడ్డ పుట్టిన విషయాన్ని బిపాసా, కరణ్ సింగ్ గ్రోవర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా పాప పేరు కూడా బయటపెట్టారు. పుట్టిన పాపకు దేవి బసు సింగ్ గ్రోవర్ అని నామకరణం చేశారు. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని ప్రకటించింది బిపాసా.
నటిగా మంచి స్టేజ్ లో ఉన్న టైమ్ లోనే సినిమాల నుంచి తప్పుకుంది బిపాసా. నటుడు కరణ్ సింగ్ ను పెళ్లాడింది. వీళ్లిద్దరూ కలిసి ఎలోన్ అనే చిత్రంలో నటించారు. బిపాసాకు 2016లో పెళ్లయింది.
Next Story