Bhuvana Vijayam - భువన విజయమ్ ట్రయిలర్ రివ్యూ
Bhuvana Vijayam Movie - సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది భువన విజయమ్. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశారు.

కొన్ని సినిమాలకు ట్రయిలర్ లో మేటర్ చెప్పకూడదు. సస్పెన్స్ మెయింటైన్ చేయాలి. మరికొన్ని సినిమాలకు మాత్రం ట్రయిలర్ లోనే విషయం చెప్పేయాలి. అలా సినిమాపై ఆసక్తిని పెంచొచ్చు. భువన విజయమ్ యూనిట్ ఈ రెండో పద్ధతిని ఎంచుకుంది. ఈరోజు రిలీజ్ చేసిన ట్రయిలర్ లో దాదాపు 90శాతం కథ చెప్పేసింది.
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కింది ‘భువన విజయమ్’. ఈ సినిమా ట్రయిలర్ లో ఓ నిర్మాతకు కథ చెప్పడానికి మొత్తం 8 మంది వస్తారు. వాళ్లలో ఒకరు మరికొద్దిసేపట్లో చనిపోతారు. ఆ చనిపోయే వ్యక్తి ఎవరు అనేది ఈ సినిమా స్టోరీ.
ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ సినిమా పై ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మే12న ‘భువన విజయమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి సినిమాటోగ్రాఫర్. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాలో కంటెంట్ అందర్నీ ఆకర్షిస్తుందని, మంచి కుటుంబ కథా చిత్రం అవుతుందని చెబుతున్నాడు దర్శకుడు చరణ్.