Bhimaa Movie | 'ది రేజ్ అఫ్ భీమా' విడుదల
Bhimaa Movie Theme song: గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా భీమా. ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు.

Bhimaa Movie | 'ది రేజ్ అఫ్ భీమా' విడుదల
Bhimaa Movie Theme song: గోపీచంద్ తాజా చిత్రం భీమా. ఎ.హర్ష దర్శకుడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మించాడు. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ బాగా క్లిక్ అయింది.
తాజాగా మేకర్స్ 'ది రేజ్ అఫ్ భీమా' ట్రాక్ ని విడుదల చేశారు. స్టార్ కంపోజర్ రవి బస్రూర్ పవర్ ప్యాక్డ్ ట్రాక్ గా స్వరపరిచారు. హై ఎనర్జిటిక్ బీట్స్ ఎక్స్ ట్రార్డినరీ గా ఉన్నాయి. రవి బస్రూర్, సంతోష్ వెంకీ లిరిక్స్ అందించడంతో పాటు పాడారు. భీమా క్యారెక్టర్ పై చిత్రీకరించిన ఈ పాటలో గోపీచంద్ యాక్షన్ అవతార్ లో కనిపించాడు.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భీమా మహా శివరాత్రి సందర్భంగా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.