Telugu Global
Cinema & Entertainment

Miral | తెలుగులోకి మరో హారర్ చిత్రం

Bharat's Miral - 'ప్రేమిస్తే' భరత్ మరో ప్రయోగం చేస్తున్నాడు. మిరల్ అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

Miral | తెలుగులోకి మరో హారర్ చిత్రం
X

ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ ‘మిరల్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన ‘మిరల్’ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు.

హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి ఎం శక్తివేల్ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ అందరినీ భయపెట్టింది. ట్రైలర్‌తో ఒక్కసారిగా మిరల్ మూవీ మీద అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాను మే 17న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కథ ఏంటి? ఏ పాయింట్ చుట్టూ తిరుగుతుంది? ప్రధాన పాత్రలు ఏంటి? అన్నది కూడా ఈ పోస్టర్‌లోనే చూపించారు.

ట్రైలర్‌లోనూ ఓ వింత మాస్క్ హైలెట్ అయింది. ఇప్పుడు ఈ పోస్టర్‌లోనూ ఆ మాస్క్‌ను చూపించారు. అసలు ఆ మాస్క్ కథ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్, పోస్టర్‌ను డిజైన్ చేశారు.

First Published:  14 May 2024 6:22 PM GMT
Next Story