Telugu Global
Cinema & Entertainment

Bharateeyudu 2 | ఈరోజు నుంచి ట్రిమ్ వెర్షన్

Bharateeyudu 2 - భారతీయుడు-2 సినిమాకు కత్తెర్లు పడ్డాయి. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో నిడివి తగ్గించారు.

Bharateeyudu 2 Movie Review: భారతీయుడు 2- రివ్యూ! {2/5}
X

అతి విశ్వాసం కొంప ముంచింది. భారతీయుడు-2 సినిమా నెగెటివ్ టాక్ తో మొదలైంది. దీంతో నష్టనివారణ చర్యలకు దిగారు మేకర్స్. సినిమా నుంచి 20 నిమిషాలకు పైగా కంటెంట్ ను తొలిగించారు. ట్రిమ్ చేసిన వెర్షన్ ను ఈరోజు నుంచి థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.

భారతీయుడు-2 ఒరిజినల్ డ్యూరేషన్ 3 గంటల 4 సెకెన్లు. బ్రేక్ తో కలుపుకొని దాదాపు 3 గంటల 15 నిమిషాలు. సినిమా రిలీజైన మొదటి ఆటకే జనాల సహనాన్ని పరీక్షించింది భారతీయుడు-2. ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా నుంచి దాదాపు 20 నిమిషాలకు పైగా సన్నివేశాల్ని కట్ చేస్తున్నారు.

సినిమా సెకెండాఫ్ లోనే ఎక్కువ కత్తెర్లు పడుతున్నాయంట. మలి భాగం నుంచి సినిమాతో సంబంధం లేని చాలా సీన్లను తొలిగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆలస్యమైంది. నష్టనివారణ చర్యలు సినిమాకు కలిసొస్తాయంటే అనుమానమే. ఎందుకుంటే, టాలీవుడ్ చరిత్రలో ఇలా కోలుకున్న సినిమా లేదు.

గతంలో చాలా సినిమాలకు ఇలానే రిలీజ్ తర్వాత ఫీడ్ బ్యాక్ ఆధారంగా రన్ టైమ్ తగ్గించారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. రవితేజ, నాని నటించిన సినిమాలు కొన్ని గతంలో ఈ చేదు అనుభవాన్ని చవిచూశాయి. భారతీయుడు-2 కూడా ఇందుకు మినహాయింపు కాదంటున్నారు పరిశీలకులు.

మరోవైపు ఈ సినిమాపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. "ఇండియన్2డిజాస్టర్" అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. అంతా ఊహించినట్టుగానే నిన్న ఈ సినిమా వసూళ్లు తగ్గాయి. మొదటి రోజు నైజాంలో దాదాపు రెండున్నర కోట్లు (జీఎస్టీ కాకుండా) షేర్ రాబట్టిన ఈ సినిమా, శనివారం భారీగా డౌన్ అయినట్టు తెలుస్తోంది.

First Published:  14 July 2024 11:17 AM IST
Next Story