Telugu Global
Cinema & Entertainment

Bharateeyudu 2 | చెన్నైలో ఆడియో ఫంక్షన్

Bharateeyudu 2 - కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 సినిమా ఆడియో ఫంక్షన్ ను జూన్ 1న సెలబ్రేట్ చేయబోతున్నారు. అంతకంటే ముందు లిరికల్ వీడియో రాబోతోంది.

Bharateeyudu 2 | చెన్నైలో ఆడియో ఫంక్షన్
X

భారతీయుడు-2 సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్ డేస్ వచ్చాయి. యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’.

వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భార‌తీయుడు’గా విడుదల చేశారు. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భార‌తీయుడు 2’ వస్తోంది.

భార‌తీయుడు సీక్వెల్ అంటే ఎలాంటి అంచ‌నాలుంటాయో వాటిని మించేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ భార‌తీయుడు 2ను విజువ‌ల్ వండ‌ర్‌గా ఆవిష్క‌రిస్తున్నాడు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ కనిపించనున్నాడు.

ఈ సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతోంది. జూలై 12న సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక జూన్ 1న చెన్నైలో గ్రాండ్ గా ఆడియోను విడుదల చేయబోతున్నారు. వీటి కంటే ముందుగా మరో 2 రోజుల్లో భారతీయుడు-2 నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు.

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీత దర్శకుడు.

First Published:  20 May 2024 5:00 PM GMT
Next Story