Telugu Global
Cinema & Entertainment

Bhale Vunnade | రాజ్ తరుణ్ సినిమా నుంచి మరో సింగిల్

Bhale Vunnade - రాజ్ తరుణ్ కొత్త సినిమా భలే ఉన్నాడే. ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజైంది.

Bhale Vunnade | రాజ్ తరుణ్ సినిమా నుంచి మరో సింగిల్
X

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైనఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ భలే ఉన్నాడే సెకండ్ సింగిల్ 'సెట్ అవుతుందా పెయిరు' సాంగ్ ని విడుదల చేశారు. సక్సెస్ ఫుల్ కంపోజర్ శేఖర్ చంద్ర ఈ సాంగ్ ని మ్యాజికల్ మెలోడీగా కంపోజ్ చేశాడు. కపిల్ కపిలన్ ఆలపించగా.. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ రాశాడు. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ ని కలర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు.

నగేష్ బానెల్లా ఈ చిత్రానికి డీవోపీగా పని చేస్తుండగా.. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాతో మనీషా హీరోయిన్ గా పరిచయమౌతోంది. సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  16 Jun 2024 6:49 AM GMT
Next Story