Bhaje Vaayu Vegam Movie OTT | ఓటీటీలోకి కార్తికేయ సినిమా
Bhaje Vaayu Vegam Movie OTT: కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం భజే వాయు వేగం. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

Bhaje Vaayu Vegam Movie OTT: యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా "భజే వాయు వేగం". గత నెల 31న థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లవర్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ నెల 28వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో "భజే వాయు వేగం" సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈరోజు నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ – థియేటర్స్ లో మా "భజే వాయు వేగం" సినిమాకు ప్రేక్షకులంతా తమ ప్రేమను అందించారు. అదే ప్రేమను మేము నెట్ ఫ్లిక్స్ ద్వారా మీ ఇంటికే వచ్చి తిరిగి ఇవ్వబోతున్నాం. అని ట్వీట్ చేశాడు.
"భజే వాయు వేగం" సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషించాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించాడు. థియేటర్స్ లో పెద్దగా క్లిక్ అవ్వని ఈ సినిమా, కనీసం ఓటీటీలోనైనా మెరుస్తుందని మేకర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లు వర్క్ చేశారు. రధన్ పాటలు కంపోజ్ చేయగా.. కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.