Telugu Global
Cinema & Entertainment

Bhairava Anthem | కల్కి ప్రచారం గీతం వచ్చేసింది

Bhairava Anthem - ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి. ఈ సినిమా నుంచి భైరవ ఆంథెమ్ ను రిలీజ్ చేశారు. ఇది ప్రచార గీతం.

Bhairava Anthem | కల్కి ప్రచారం గీతం వచ్చేసింది
X

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కల్కి’. ఈ సినిమా నుంచి ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ 'భైరవ అంథమ్' ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో గ్లోబల్ ఐకాన్‌లు ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్‌ ను ఒకే ఫ్రేమ్ లో చూడొచ్చు.

'కల్కి' మూవీ చాలామందికి డ్రీమ్ ప్రాజెక్టు. దేశంలోని బిగ్గెస్ట్ స్టార్స్ ని ఒక్కచోటికి చేర్చింది, కామిక్-కాన్ శాన్ డియాగోలో తనదైన ముద్ర వేసి, మొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది, యానిమేటెడ్ ప్రిల్యుడ్ ప్రజెంట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ మూవీ కల్కి. ఈ సినిమా కోసం 4-టన్నుల బరువైన కారును సృష్టించారు.

ఇప్పుడు దీనికి కొనసాగింపుగా.. నార్త్, సౌత్ ఇండియా సంస్కృతుల్ని కలుపుతూ ఒక అంథమ్ కంపోజ్ చేశారు. కల్కి లక్షణాల్ని వివరిస్తూనే, ఆకట్టుకునేలా కంపోజిషన్ ఉంది.

దిల్జిత్ దోసాంజ్, విజయ నారాయణ్ పాడిన ఈ పాటకు కుమార్ లిరిక్స్ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ ట్రాక్ సినిమాలోని ప్రభాస్ భైరవ క్యారెక్టర్ కు ఎలివేట్ చేసింది. పోనీ వర్మ కొరియోగ్రాఫ్ చేసిన ఈ వీడియోలో బ్లాక్ లుంగీలు, తలపాగాలు ధరించి దిల్జిత్, ప్రభాస్ స్టయిల్ గా కనిపించారు.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

First Published:  17 Jun 2024 5:01 PM GMT
Next Story