Bhagavanth Kesari | కీలక షెడ్యూల్ పూర్తి చేసిన భగవంత్ కేసరి యూనిట్
Bhagavanth Kesari - బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో కీలక షెడ్యూల్ పూర్తయింది.

నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్' భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ మేరకు పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు.
ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ తన పోర్షన్ ని పూర్తి చేశాడు. ఈ చిత్రంలో అతని పాత్ర పేరు రాహుల్ సంఘ్వి. మేకర్స్ షేర్ చేసిన పోస్టర్లలో అర్జున్ రాంపాల్, బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఉన్నారు. అర్జున్ రాంపాల్ కు తెలుగులో ఇదే తొలి చిత్రం.
'భగవంత్ కేసరి' యునిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ ఎఁటర్ టైనర్ గా వస్తోంది. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి ప్రజంట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సూపర్ హిట్టయింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లు చెప్పడం అందర్నీ అలరించింది.
సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆయన కూతురు వరస పాత్రలో శ్రీలీల కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే లిరికల్ సాంగ్స్ విడుదల చేయబోతున్నారు.