Bhagavanth Kesari | భగవంత్ కేసరి థియేట్రికల్ రన్ పూర్తి
Bhagavanth Kesari Closing Collection | బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా తన థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇంతకీ ఈ సినిమా వసూళ్ల సంగతేంటి?

బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి
Bhagavanth Kesari | బాలకృష్ణ, అనీల్ రావిపూడి ఫ్రెష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. దసరా కనుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తన థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. కంప్లిట్ రన్ లో ఇది క్లీన్ హిట్ గా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 70 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. విజయ్ నటించిన లియో సినిమా, రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావుతో పోటీపడిన ఈ మూవీ.. రవితేజ మూవీని పక్కకునెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో లియో సినిమాను కూడా అధిగమించినప్పటికీ, ఓవర్సీస్ లో లియోతో సమానంగా నడవలేకపోయింది.
అయితే బాలకృష్ణ డిఫరెంట్ గా కనిపించడం, కొత్త గెటప్ తో పాటు, సరికొత్త డైలాగ్ డెలివరీతో కూడా ఆకట్టుకోవడంతో భగవంత్ కేసరి సినిమాకు లాంగ్ రన్ దక్కింది. బాలయ్య మార్క్ పెద్దగా లేనప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ ఈ కొత్తదనాన్ని స్వీకరించారు. బాలయ్యకు జై కొట్టారు.
ఇక క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాంలో 18 కోట్లు, సీడెడ్ లో 15.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 6.75 కోట్లు, కృష్ణాలో 3.5 కోట్లు షేర్ రాబట్టింది ఈ సినిమా. ఓవర్సీస్ లో ఈ సినిమాకు 6.8 కోట్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా 70.15 కోట్ల షేర్ రాబట్టి హిట్ మూవీగా నిలిచింది.