యూట్యూబర్ హర్ష సాయిపై కేసు ఎందుకంటే ?
యూట్యూబర్ హర్ష సాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మ్యారేజ్ పేరుతో తన నుంచి రూ.2 కోట్లు తీసుకున్నారని యువతి ఆరోపించారు.

యూట్యూబర్ హర్ష సాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మ్యారేజ్ పేరుతో తన నుంచి రూ.2 కోట్లు తీసుకున్నారని యువతి ఆరోపించారు. హర్ష తండ్రిపై కూడా యువతి కంప్లైంట్ చేసింది. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్‌లో దాదాపు 14 మిలయన్ ఫాలవోర్స్ ఉన్నరు హర్ష సాయి.. బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. హర్ష సాయి హీరోగా మధ్య ఓ మూవీ ప్రారంభించారు. అతనే సొంతంగా ఓ కథ రాసుకుని.. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం మెగా. అప్పట్లో టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమాకు నిర్మాత ఎవరో కాదు. బిగ్ బాస్ ఫెమ్ మిత్ర శర్మ. బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న మిత్ర శర్మ నిర్మాతగా మారి హర్ష సాయితో సినిమా అనౌన్స్ చేసింది.