Bandla Ganesh - అదే నా చిరకాల కోరిక
Bandla Ganesh - బండ్ల గణేశ్ తన చిరకాల కోరికను బయటపెట్టారు. పవన్ తో నిత్యం సినిమాలు తీస్తూనే ఉండాలనేది ఆయన డ్రీమ్.

బండ్ల గణేశ్ ను కదిలిస్తే తన దేవుడు పవన్ కల్యాణ్ అంటారు. కానీ అదే పవన్ తో సినిమా చేయలేక కిందామీద పడుతున్నారు. నిజంగా పవన్ తలుచుకుంటే, ఈ క్షణమే బండ్ల గణేశ్ తో సినిమాను లాంఛ్ చేసి, సెట్స్ పైకి కూడా రావొచ్చు. కానీ అలా జరగడం లేదు.
దీంతో బండ్లకు సోషల్ మీడియాలో ప్రశ్నల పరంపర ఎక్కువైంది. పవన్ తో సినిమా ఎనౌన్స్ చేసిన బండ్ల గణేశ్, ఆ మూవీని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొస్తారో చెప్పాలంటే అంతా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బండ్ల మరోసారి పరోక్షంగా స్పందించాడు.
"ఎప్పటికీ ఇప్పటికీ ఎన్నటికీ నా డ్రీమ్ ఒకటే. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయటం. ఆయనతో సినిమాలు తీస్తూనే ఉండటం. అదే నా డ్రీమ్. అదే ఎయిమ్" అంటూ మరోసారి ట్వీట్ వేశారు బండ్ల గణేశ్.
ఈ ట్వీట్ తో బండ్ల గణేశ్, పవన్ తో సినిమాపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చినట్టయింది. ప్రస్తుతం కొంతమంది దర్శకులతో చర్చలు జరుపుతున్నారు బండ్ల గణేశ్. పవన్ కు సూటయ్యే కథ దొరికితే, వెంటనే పవన్ కు వినిపిస్తారు. కథ నచ్చితే, పవన్ వెంటనే కాల్షీట్లు ఇవ్వడానికి రెడీ. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం..