Veera Simha Reddy: సంక్రాంతి బరిలో పెద్ద సినిమా ఇదే
Veera Simha Reddy Movie Run Time: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉందంట.

Veera Simha Reddy: సంక్రాంతి బరిలో పెద్ద సినిమా ఇదే
సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ, విజయ్ నటించిన సినిమాలు వస్తున్నాయి. ఇవన్నీ పెద్ద సినిమాలే. బడ్జెట్ పరంగా దేన్నీ తక్కువచేసి చూడలేం. అయితే రన్ టైమ్ పరంగా మాత్రం వీరసింహారెడ్డి మాత్రమే పెద్ద సినిమా.
అవును.. వీరసింహారెడ్డి నిడివి చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 57 నిమిషాలు ఉందంట. అంటే, దాదాపు 3 గంటల సినిమా అన్నమాట. బాలయ్య సినిమా ఇంత రన్ టైమ్ తో ఇప్పటివరకు రాలేదు.
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రన్ కూడా ఎక్కువే. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు ఉంది. ఈ సినిమాలో రవితేజ కూడా ఉన్నాడు. సెకెండాప్ లో అతడి పోర్షన్ బాగా వచ్చిందట. అందుకే నిడివి పెరిగినా అలానే ఉంచేశారు.
ఇక బాలయ్య సినిమాలో కూడా ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయంట. రన్ టైమ్ పెరిగిందని ఎడిటింగ్ చేస్తే, ఎమోషన్ తగ్గిపోతోందట. అందుకే 3 గంటల రన్ టైమ్ నే లాక్ చేసినట్టున్నారు. విజయ్ నటించిన వారసుడు సినిమానే నిడివి పరంగా చిన్న సినిమా.