Unstoppable with NBK S2: రాజకీయ నాయకులతో ఫలితం దక్కుతుందా?
Unstoppable with NBK S2: బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్-స్టాపబుల్ కార్యక్రమం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

Unstoppable with NBK S2: రాజకీయ నాయకులతో ఫలితం దక్కుతుందా?
అన్-స్టాపబుల్ రెండో సీజన్ లో 'ఆహా' అపసోపాలు పడుతోంది. బాలయ్యను యాంకర్ గా మార్చేసి చేసిన ఈ కార్యక్రమం సీజన్-1 పెద్ద హిట్టయింది. సీజన్-2 మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాల్ని అందుకోలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం సరైన గెస్టులు దొరక్కపోవడమే.
నాగశౌర్య, అడివిశేష్, శర్వానంద్ లాంటి స్టార్స్ తో లాగిస్తున్నప్పటికీ రిజల్ట్ కనిపించడం లేదు. ఉన్నంతలో చంద్రబాబు-లోకేష్ తో బాలయ్య చేసిన ఇంటర్వ్యూ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో పొలిటికల్ బాట పట్టింది ఆహా. బాలయ్యతో రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేయిస్తోంది.
త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి బాలయ్య షోకు గెస్టులుగా రాబోతున్నారు. వీళ్లంతా ఒకప్పుడు క్లాస్ మేట్స్, కలిసి చదువుకున్నారు. వీళ్లను ఆహాలో చూపించబోతున్నాడు బాలయ్య. అయితే ఇలా పొలిటికల్ టర్న్ తీసుకున్న అన్-స్టాపబుల్ ఏ మేరకు ఫలితాన్నందిస్తుందనే చూడాలి.