Bhagavanth Kesari - బాలకృష్ణ సినిమా టీజర్ పై కీలక ప్రకటన
Balakrishna's Bhagavanth Kesari - అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను రేపు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Balakrishna Remuneration | పారితోషికం పెంచిన బాలయ్య
బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఫస్ట్ టైమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి 'ఐ డోంట్ కేర్' అనేది ట్యాగ్ లైన్. టైటిల్ పోస్టర్ తో హాట్ టాపిక్ గా మారిన భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ బయటపెట్టింది యూనిట్.
ఈ సినిమా టీజర్ ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రేపు (జూన్ 10న) విడుదల చేయనున్నారు. టైటిల్ పోస్టర్ లాగే టీజర్ విషయంలో కూడా అదే స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నారు మేకర్స్. టీజర్ ను ప్రపంచవ్యాప్తంగా 108 థియేటర్లలో ప్రదర్శిస్తారు. ఎందుకంటే, ఇది బాలయ్య 108వ చిత్రం కాబట్టి.
ఇప్పటికే టైటిల్ పోస్టర్ తో సంబరాలు మొదలయ్యాయి. స్పెషల్ డేట్ లో వచ్చే టీజర్ తో అభిమానులు సందడి డబుల్ కానుంది. కామెడీకి కేరాఫ్ గా నిలిచే అనీల్ రావిపూడి, బాలయ్యను యాక్షన్ మోడ్ లో ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందర్లో ఉంది.
ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో కోర్ టీమ్ పాల్గొంటోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అతడు విలన్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరాకి థియేటర్లలోకి వస్తోంది.