Bhagavanth Kesari Box Office Collections | నైజాంలో రికార్డ్ దిశగా భగవంత్ కేసరి
Bhagavanth Kesari Box Office Collections | బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది.

బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి
Bhagavanth Kesari Box Office Collections | బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతోంది. నిన్నటితో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 38.7 కోట్లు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.
తాజా వసూళ్లతో ఈ సినిమా 53శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది. పూర్తిస్థాయిలో కోలుకోవాలంటే ఈ సినిమా మరో వారం రోజులు గట్టిగా ఆడాల్సి ఉంటుంది. దసరా సీజన్ కావడం, మరో 3 రోజులు హాలిడేస్ ఉండడంతో, భగవంత్ కేసరి తొందరగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా నుంచి దంచవే మేనత్త కూతురా అనే పాటను వ్యూహాత్మకంగా తొలిగించారు. ఒకవేళ ఆక్యుపెన్సీ తగ్గి, వసూళ్లు పడిపోతున్నాయని భావిస్తే, వెంటనే ఆ సాంగ్ ను యాడ్ చేస్తారు. మరోవైపు నైజాంలో ఈ సినిమా ఓ చిన్న రికార్డ్ సృష్టించే దిశగా దూసుకుపోతోంది. విడుదలైన 4 రోజుల్లో ఈ సినిమాకు 9 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇవాళ్టి వసూళ్లతో ఈ సినిమా 10 కోట్ల మార్క్ అందుకోబోతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఈ సినిమాకు సీడెడ్ నుంచి ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి. సీమ నుంచి ఈ సినిమాకు ఇప్పటివరకు 6 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు గుంటూరు నుంచి ఏకంగా 3 కోట్ల 85 లక్షల రూపాయల షేర్ రావడం విశేషం.
తెలుగులో లియోకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అటు టైగర్ నాగేశ్వరరావుకు కూడా ఫ్లాప్ టాక్ నడుస్తోంది. సో.. భగవంత్ కేసరి సినిమాకు రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అనీల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ నటించగా, బాలయ్య కూతురి వరుస పాత్రలో శ్రీలీల నటించింది.