Telugu Global
Cinema & Entertainment

బాలకృష్ణ మూవీ షూటింగ్ అప్ డేట్స్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కర్నూలులో కొత్త షెడ్యూల్ ఈరోజు నుంచి మొదలైంది.

బాలకృష్ణ మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ వస్తోంది. #NBK107 వర్కింగ్ టైటిల్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈరోజు నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనుంది. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ ‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి స్టార్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్న ఫైట్స్, ఈ సినిమాకు హైలెట్ అవుతాయంటున్నారు.




First Published:  25 July 2022 2:50 AM
Next Story