Telugu Global
Cinema & Entertainment

గుర్తుపట్టావా.. డాకు మహారాజ్‌

బాలకృష్ణ కొత్త మూవీ . 'డాకు మహారాజ్‌' టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం

గుర్తుపట్టావా.. డాకు మహారాజ్‌
X

హీరో బాలకృష్ణ, డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం విదితమే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ109 సినిమాగా ఇది ప్రచారంలో ఉన్నది. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. 'డాకు మహారాజ్‌' అనే పేరు ఖరారు చేసింది. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.

'ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది ఆకదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది' అనే డైలాగ్స్‌తో టీజర్‌ మొదలైంది. 'గుర్తుపట్టావా.. డాకు మహారాజ్‌' అంటూ బాలయ్య మార్క్‌ డైలాగ్స్‌, విజువల్స్‌ ఈలలు వేయించేలా ఉన్నాయి.



పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఈ మూవీ ఉంటుందని సమాచారం. భిన్న కాలాల్ని ప్రతిబింబించే కథతో రూపొందుతుండటంతో.. ఈ కథ సాగే కాలానికి తగ్గట్లుగానే బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌కు చెందిన ఊర్వశీ రౌతేలా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.

First Published:  15 Nov 2024 11:18 AM IST
Next Story