Telugu Global
Cinema & Entertainment

Balakrishna | బాలయ్య గెస్ట్ రోల్?

Balakrishna - బాలకృష్ణ గెస్ట్ రోల్స్ కు దూరం. అప్పుడెప్పుడో ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. మళ్లీ ఇన్నాళ్లకు కొడుకు సినిమా కోసం రెడీ అవుతున్నారు.

Balakrishna | బాలయ్య గెస్ట్ రోల్?
X

కొత్తగా హీరోలుగా ఎంట్రీ ఇవ్వాలనుకునేవాళ్లు రొటీన్ ప్రేమకథలు, యాక్షన్ సినిమాల్ని ఎంచుకుంటారు. తన కొడుకును ఆ పంథాలో ప్రవేశపెట్టాలని బాలకృష్ణ అనుకోవడం లేదు. అందుకే తొలి చిత్రానికే కొడుకు మోక్షజ్ఞ కోసం సోషియా ఫాంటసీ కథను సిద్ధం చేశారు.

కొన్నాళ్లుగా నందమూరి అభిమానులు, ప్రేక్షకులు మోక్షజ్ఞ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రశాంత్ వర్ దర్శత్వంలో రాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఇది మహాభారతం నేపథ్యంలో సాగే సోషియో-ఫాంటసీ సినిమాగా ఉండబోతోంది.

ఈ సినిమాలో మోక్షజ్ఞ,అభిమన్యుడు పాత్రలో కనిపిస్తాడట. అలా మహాభారతానికి ముడిపెడుతూ వినూత్నమైన కథతో ఈ సినిమా రాబోతోంది. మోక్షజ్ఞ పుట్టినరోజున అధికారికంగా ఈ సినిమాను ప్రకటించాలని చిత్ర బృందం భావిస్తోంది.

ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఏ డెబ్యూ హీరోకి ఖర్చుపెట్టనంత భారీ బడ్జెట్ ను మోక్షు సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టుకు మరో ప్రత్యేకత యాడ్ అయింది. కొడుకు కోసం స్వయంగా బాలకృష్ణ, ఇందులో ఓ కీలక పాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది.

సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మహాభారతం ఎపిసోడ్ లో బాలయ్య కనిపిస్తారట. అలా తొలి సినిమాకే తండ్రీకొడుకుల కాంబినేషన్‌ తెరపైకి రాబోతోంది. దీంతో నందమూరి అభిమానులు థ్రిల్‌ ఫీలవుతున్నారు.

First Published:  4 Aug 2024 3:33 PM GMT
Next Story