Telugu Global
Cinema & Entertainment

Veera Mass | ఈ టైటిల్ వద్దంటున్న ఫ్యాన్స్

Veera Mass - వీరమాస్.. టైటిల్ లో మాస్ ఉంది. కానీ ఈ టైటిల్ మాకొద్దంటున్నారు బాలయ్య అభిమానులు.

Veera Mass | ఈ టైటిల్ వద్దంటున్న ఫ్యాన్స్
X

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ తొలిసారి చేతులు కలిపారు. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీకి బాలయ్యను డైరక్ట్ చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. కెరీర్ లో బాలయ్యకు ఇది 109వ చిత్రం.

ఈ చిత్రానికి ‘వీర మాస్‌’ అనే టైటిల్‌ని పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ మాస్ కు కేరాఫ్ అడ్రస్. కాబట్టి ఈ టైటిల్ అతడి ఇమేజ్ కు బాగా సరిపోతుందని దర్శకుడు నమ్ముతున్నాడు.

అయితే ఇలాంటి టైటిల్స్‌ను ఆయన అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. చాలా ఓల్డ్ స్టయిల్ లో టైటిల్ ఉందని, ఇలాంటి టైటిల్స్ నుంచి దూరంగా జరగాలని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించొద్దని ఈ చిత్ర నిర్మాత నాగవంశీని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  17 July 2024 6:31 AM GMT
Next Story