Telugu Global
Cinema & Entertainment

Balakrishna | విశ్వక్ సేన్, నేను సోదరులం

Balakrishna - విశ్వక్ సేన్ ను తన సొంత సోదరుడిలా భావిస్తాడట బాలకృష్ణ. దీనికి ఆయన కొన్ని కారణాలు కూడా చెప్పారు.

Balakrishna | విశ్వక్ సేన్, నేను సోదరులం
X

విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన సినిమా ఇది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. మే 31వ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మే 28న యుగపురుషుడు నందమూరి తారక రామారావు జయంతి. గతేడాది ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ఫస్ట్ లుక్ విడుదల చేసిన నిర్మాతలు, ఈ ఏడాది ఎన్టీఆర్ 101వ జయంతికి ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.

"ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. బయట చూస్తే ఎవరైనా మమ్మల్ని కవలలే అంటారు. సినీ పరిశ్రమలో కొంతమందితోనే నేను చాలా సన్నిహితంగా ఉంటాను. విశ్వక్ కి సినిమా అంటే ప్యాషన్. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నాను. తను కూడా నాలాగే సినిమా సినిమాకి, పాత్ర పాత్రకి కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం కూడా ఉంది."

ఇలా విశ్వక్ సేన్ ను చూస్తే, తననుతాను చూసుకుంటున్నట్టు ఉంటుందని వెల్లడించారు బాలయ్య. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలని, అది తను ఎన్టీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నానని, కొత్తదనం ఇస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని అంటున్నారు బాలకృష్ణ.

First Published:  29 May 2024 1:49 AM GMT
Next Story