Telugu Global
Cinema & Entertainment

Baby Movie | బేబి మూవీ అప్పలరాజులా తయారైంది

Baby Movie - తన సినిమా అప్పల్రాజు సినిమా స్టోరీలా తయారైందంటున్నాడు దర్శకుడు. మంచి విషయంపై సినిమా తీస్తే, అసభ్యతకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారని బాధపడుతున్నాడు

Baby movie review: బేబీ- మూవీ రివ్యూ! {2.25/5}
X

Baby movie review: బేబీ- మూవీ రివ్యూ! {2.25/5}

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా బేబి. సాయిరాజేష్ ఈ సినిమాను డైరక్ట్ చేశాడు. థియేటర్లలో యూత్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తను ఒకటి తలిస్తే, ఈ సినిమాను ప్రేక్షకులు మరోలా ఎంజాయ్ చేస్తున్నారని బాధపడ్డాడు సాయిరాజేష్.

చాన్నాళ్ల కిందట రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం అప్పల్రాజు అనే సినిమా వచ్చింది. అందులో హీరో ఓ మంచి సినిమా తీయాలనుకుంటాడు. యాక్షన్-రొమాన్స్ అన్నీ మిక్స్ చేయాలనుకుంటాడు. చివరికి వచ్చేసరికి అదో పెద్ద కామెడీ సినిమా అవుతుంది. తను ఏదో తీయాలనుకుంటే, తెరపై ఇంకేదో కనిపిస్తుంది. ఈ సినిమాను రిఫరెన్స్ గా తీసుకొని, బేబి సినిమాను కంపేర్ చేశాడు సాయిరాజేష్.

"నేను మంచి ఉద్దేశంతోనే సినిమాను తీశాను. కానీ జనాలు ఎక్కడైతే రియాక్ట్ కాకూడదో అక్కడ రియాక్ట్ అవుతున్నారు. నా సినిమా అప్పలరాజులా మారిపోయింది. తొలిప్రేమకు మరణం లేదు మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అని చెప్పాలని అనుకున్నా.. అందుకే చివరి షాట్ అలా పెట్టాను. హీరో హీరోయిన్లు తొలి ప్రేమను తలుచుకుని బాధపడే షాట్లు పెట్టాను. కానీ తొలిప్రేమను వదిలేసి, బోల్డ్ సీన్లు, డైలాగ్స్ కు ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్నారు."

ప్రస్తుతం బేబి సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఆ సినిమాలో కొన్ని తప్పులున్నమాట వాస్తవమేనని, అందుకే సినిమా హిట్టయినా, తనకు మిక్స్ డ్ ఫీలింగ్ ఉందని అంటున్నాడు సాయిరాజేష్. ఓవైపు సినిమాలకు డైరక్షన్ చేస్తూనే, మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతానంటున్నాడు సాయిరాజేష్.

First Published:  20 July 2023 2:31 PM IST
Next Story