Telugu Global
Cinema & Entertainment

Baby Box Office Collection | బేబి మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌

Baby Movie first weekend collection | బేబి మూవీ యూత్ కు కనెక్ట్ అయింది. మొదటి 3 రోజులు కుర్రకారు థియేటర్లకు పోటెత్తారు.

Baby Box Office Collection | బేబి మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌
X

Baby Box Office Collection | బేబి మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌

Baby Box Office Collection | ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా బేబి. విరాజ్ అశ్విన్ సెకెండ్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. ఆనంద్ దేవరకొండ కెరీర్ లో తొలి థియేట్రికల్ హిట్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ సాధించింది.

ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు 9 కోట్ల 23 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఈ సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అవ్వడం విశేషం. సాయిరాజేష్ ఈ కథను స్వయంగా రాసుకోవడంతో పాటు, తనే డైరక్ట్ చేశాడు. ఎస్కేఎన్ నిర్మాత. తెలుగు రాష్ట్రాల్లో బేబి సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

ఏపీ,నైజాం 3 రోజుల షేర్లు

నైజాం - 3.79 కోట్లు

సీడెడ్ - 1.28 కోట్లు

ఉత్తరాంధ్ర - 1.52 కోట్లు

ఈస్ట్ - 73 లక్షలు

వెస్ట్ - 48 లక్షలు

గుంటూరు - 53 లక్షలు

నెల్లూరు - 31 లక్షలు

కృష్ణా - 59 లక్షలు

First Published:  17 July 2023 3:02 PM IST
Next Story