Telugu Global
Cinema & Entertainment

Anand Deverakonda - బేబీ మూవీ నా కెరీర్ బెస్ట్ జర్నీ

Anand Deverakonda - బేబీ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాను తన కెరీర్ బెస్ట్ జర్నీగా చెప్పుకొస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే..!

Anand Deverakonda - బేబీ మూవీ నా కెరీర్ బెస్ట్ జర్నీ
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సాంగ్స్ హిట్టయ్యాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ మీడియాతో మాట్లాడాడు.

- బేబీ అనేది నా బెస్ట్ జర్నీ. సెట్‌ను, షూటింగ్‌ను మిస్ అవుతున్నాను. ఈ పాత్రను పోషించగలను అని నాలో నమ్మకాన్ని సాయి రాజేష్ నింపాడు. నా కెరీర్‌లో బేబీ ఎప్పటికీ నిలిచిపోతుంది.

- సినిమాలో ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను బాగా చూపించాం. వాటికి ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ట్రైలర్‌లో చూపించిన ఎమోషన్ కంటే.. సినిమాలో మరో 50 శాతం ఎక్కువే ఉంటుంది.

- తొలిప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. తొలి ప్రేమ అనేది పైపైన అందాన్ని చూసి పుడుతుంది. కానీ మెల్లిమెల్లిగా ప్రేమ అర్థాన్ని తెలుసుకుంటారు. దాన్నే ఈ సినిమాలో చక్కగా చూపించాం. తొలి ప్రేమ అనేది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

- ప్రేమ దేశం సినిమాకు బేబీ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. చాలా కొత్తగా ఉంటుంది. ఫీల్‌ వైజ్ చూస్తే మాత్రం ప్రేమిస్తే, 7/జీ బృంధావన కాలనీ స్టైల్లో ఉంటుంది. ఈ సినిమాలోకి ముందుగా నేను వచ్చాను. ఆ తరువాత వైష్ణవి, విరాజ్‌ వచ్చారు.

- నేను గడ్డం పెంచుకున్నట్టుగా కనిపించినా, అమ్మాయి అందంగా మారినట్టు కనిపించినా వాటికంటూ ఓ సందర్భం ఉంటుంది. ఆ అమ్మాయిలో ఉండే కోరికలను రిఫ్లెక్ట్ చేసేలానే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూపించాం. ట్రైలర్‌లో అసలు స్టోరీని చూపించలేదు. మూడు పాత్రలను పరిచయం చేశామంతే. అసలు కథ సినిమా చూస్తే తెలుస్తుంది.

- నాకు ఇంత వరకు థియేట్రికల్ హిట్ లేదు. మా సినిమా బజ్ చూసి, ట్రైలర్ రియాక్షన్ చూసి, పాటలకు వచ్చి చూసిన రెస్పాన్స్‌తో ప్రీమియర్స్ పెట్టాం. మిడిల్ క్లాస్ మెలోడీస్ కంటే ముందే ఈ కథ విన్నాను.

First Published:  12 July 2023 7:53 PM IST
Next Story