'కాంతార'లో ఆ పాట మిస్.. ఓటీటీ ప్రేక్షకులు హర్ట్.. నెట్టింట రెండ్రోజుల నుంచి ఇదే చర్చ..
వరహరూపం అనే పాట తమ పాటను చూసి కాపీ కొట్టి తీశారని.. కేరళకు చెంది ఓ మ్యూజిక్ సంస్థ కోర్టుకెక్కింది. దీంతో ఈ పాటను ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఎక్కడా ప్రదర్శించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటను ప్రైమ్‌లో పెట్టలేదు.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన కాంతార మూవీ ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. అన్ని భాషల్లో కలిపి రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక కర్ణాటకలో అయితే భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూడగా.. ఈ నెల 24 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ ప్రేక్షకులు మాత్రం తీవ్ర నిరాశతో ఉన్నారు. అందుకు కారణం.. ఈ సినిమాలో ఎంతో పాపులర్ అయిన వరాహరూపం అనే పాట లేకపోవడమే.
నిజానికి క్లైమాక్స్ లో వినిపించే వరాహరూపం అనే పాట సినిమాకు ప్రాణం వంటిది. ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది ఈ పాట. ఇక చివర్లో రిషబ్ శెట్టి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భూతకోళ అనే ఆ సాంస్కృతిక నృత్యం చేస్తూ రిషబ్ శెట్టి అలరించాడు. అయితే ఈ పాటకు సంబంధించి ఓ వివాదం తలెత్తింది. వరహరూపం అనే పాట తమ పాటను చూసి కాపీ కొట్టి తీశారని.. కేరళకు చెంది ఓ మ్యూజిక్ సంస్థ కోర్టుకెక్కింది. దీంతో ఈ పాటను ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఎక్కడా ప్రదర్శించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటను ప్రైమ్‌లో పెట్టలేదు.
దాని స్థానంలో మరోపాటను అప్పటికప్పుడు చిత్రీకరించి జత చేశారు. కానీ థియేటర్‌లో ప్రదర్శించిన పాట ప్రైమ్‌లో లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ప్రైమ్‌లో వరాహరూపం ఒరిజినల్ పాటను పెట్టాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ కూడా పెడుతున్నారు.