Telugu Global
Cinema & Entertainment

Aa Okkati Adakku | రంగంలోకి దిగిన ఏషియన్ మూవీస్

Aa Okkati Adakku - ఏషియన్ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి డిస్ట్రిబ్యూషన్ కోసం కొత్త కంపెనీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సంస్థపై ఆ ఒక్కటి అడక్కు రిలీజ్ అవుతోంది.

Aa Okkati Adakku | రంగంలోకి దిగిన ఏషియన్ మూవీస్
X

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా, కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో, చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఆ ఒక్కటి అడక్కు'. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.

టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ 'ఆ ఒక్కటి అడక్కు' ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ వేసవిలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం మంచి వినోదాన్ని అందిస్తుందని, లీడ్ పెయిర్ మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్.

ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రాఫర్ కాగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ జానీ లీవర్ ఈ సినిమాలో నటించారు. ఆయన తో పాటు వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ అదనం.

First Published:  10 April 2024 11:06 PM IST
Next Story