Telugu Global
Cinema & Entertainment

మరో హీరోను ముగ్గులోకి దింపిన ఏషియన్

Asian Daggubati - ఏషియాన్ సంస్థ, ఈసారి దగ్గుబాటి హీరోలపై దృష్టిపెట్టింది. వాళ్లతో కలిసి మల్టీప్లెక్స్ స్టార్ట్ చేస్తోంది.

మరో హీరోను ముగ్గులోకి దింపిన ఏషియన్
X

మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి రావాలనుకునే హీరోలకు కేరాఫ్ గా మారింది ఏషియన్ సినిమాస్ గ్రూప్. ఇప్పటికే మహేష్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ తో మల్టీప్లెక్స్ వ్యాపారాలు చేస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు దగ్గుబాటి కుటుంబాన్ని కూడా ఇందులోకి ఆకర్షిస్తోంది.

త్వరలోనే ఏషియన్ గ్రూప్, దగ్గుబాటి కుటుంబం కలిసి ఓ మల్టీప్లెక్స్ ను స్టార్ట్ చేయబోతున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ప్రముఖ థియేటర్ సుదర్శన్ 70ఎఎంను వీళ్లు రీ-మోడలింగ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యం కలిగిన థియేటర్ ఇది. ఇప్పుడీ థియేటర్ ను ఏషియన్ గ్రూప్ తో కలిసి దగ్గుబాటి కుటుంబం దక్కించుకుంది.

దీన్ని మల్టీప్లెక్స్ చేయబోతున్నారు. ఆ తర్వాత సుదర్శన్ అనే పేరు కనుమరుగుకానుంది. తమ శైలిలోనే ఈ మల్టీప్లెక్స్ కు ఏషియన్ విక్టరీ అనే పేరు పెట్టబోతున్నారు. ఇక్కడ విక్టరీ అంటే విక్టరీ వెంకటేష్ అని అర్థం.

మహేష్ బాబుతో కలిసి ఓ మల్టీప్లెక్ట్ పెట్టింది ఏషియన్ గ్రూప్. దానికి ఏఎంబీ అని పేరు పెట్టారు. తాజాగా బన్నీతో కలిసి సత్యం థియేటర్ కూలగొట్టి, ఆ స్థానంలో ఓ మల్టీప్లెక్స్ పెట్టారు. దానికి ఏఏఏ సినిమాస్ అని పేరు పెట్టారు. అటు మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండతో కలిసి ఓ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వెంకటేష్-రానాతో కలిసి మల్టీప్లెక్స్ స్థాపించబోతున్నారు.

First Published:  19 Jun 2023 5:34 PM IST
Next Story