Telugu Global
Cinema & Entertainment

ప్రేక్షకులు థియేటర్లకు అందుకే రావడం లేదు

ఎక్కువ శాతం థియేటర్లు కొంతమంది చేతిలోకి వెళ్లడం వల్లనే ప్రస్తుతం థియేటర్లకు ఈ గతి పట్టిందంటున్నారు అశ్వనీదత్.

Ashwini Dutt
X

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ వ్యవస్థ గాల్లో దీపంగా మారిన సంగతి తెలిసిందే. ఎంత బజ్ ఉన్న సినిమా వచ్చినప్పటికీ ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. ఈ పరిస్థితిపై ఓ సీనియర్ నిర్మాతగా తనదైన విశ్లేషణ ఇచ్చారు అశ్వనీదత్. ఆయన చెప్పిన రీజన్స్ కూడా సహేతుకంగా ఉన్నాయి.

"ఒకప్పట్లా ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లకు రావడం లేదనేది వాస్తవం. దీనికి కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు ఉన్నాయి."

ఇలా ప్రస్తుతం నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ పై స్పందించారు అశ్వనీదత్. కొంతమంది చాలా థియేటర్లను చేతిలోకి తీసుకొని స్నాక్స్ రేట్లను ఇష్టారాజ్యంగా పెంచేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అశ్వనీదత్. దీనిపై టాలీవుడ్ కు చెందిన కొంతమంది ఎగ్జిబిటర్లు కమ్ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీతారామం అనే సినిమా నిర్మించారు అశ్వనీదత్. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. దుల్కర్ హీరోగా నటించిన ఈ సినిమాకు పాన్ ఇండియా మూవీ అవ్వదగ్గ అర్హతలన్నీ ఉన్నాయంటున్నారు అశ్వనీదత్.

First Published:  28 July 2022 2:28 PM GMT
Next Story