Telugu Global
Cinema & Entertainment

షాకింగ్.. విశ్వక్ సేన్ సినిమా అక్కడ ఫెయిల్

విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా అశోకవనంలో అర్జునకల్యాణం. తాజాగా ఈ సినిమా బుల్లితెరపైకొచ్చింది. రిజల్ట్ ఏంటో చూడండి..

షాకింగ్.. విశ్వక్ సేన్ సినిమా అక్కడ ఫెయిల్
X

ఈ ఏడాది ప్రథమార్థంలో విజయవంతమైన సినిమాల జాబితాలో అశోకవనంలో అర్జునకల్యాణం కూడా ఒకటి. ఈ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో నిలబడలేకపోయింది. దీనికి కారణం సినిమాలో కంటెంట్ కాదు. ఈ సినిమా వచ్చిన కొన్ని రోజులకే మహేష్ బాబు మూవీ రావడంతో, తప్పనిసరి పరిస్థితుల మధ్య విశ్వక్ సేన్ సినిమాను థియేటర్ల నుంచి లేపేశారు.

అలా కంటెంట్ బాగుందనే పేరు తెచ్చుకునేలోపే సినిమా థియేటర్ల నుంచి తప్పుకుంది. అందుకే మూవీకి కలెక్షన్లు లేకపోయినా, ఈ ఏడాది సక్సెస్ ఫుల్ సినిమాల జాబితాలో అశోకవనంలో అర్జునకల్యాణం మూవీని కూడా చేర్చారు క్రిటిక్స్. అలా తన కెరీర్ లో మరో హిట్ సినిమాను వేసుకున్నాడు విశ్వక్ సేన్.

రోజుల వ్యవథిలోనే థియేటర్ల నుంచి మాయమైన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం ప్రభంజనం సృష్టిస్తుందని అంతా భావించారు. ఎందుకంటే, ఇందులో కంటెంట్ అలాంటిది. స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కు ఈ కథ, కథనం, కామెడీ బాగా నచ్చుతాయని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఆశ్చర్యంగా బుల్లితెర వీక్షకుల తిరస్కరణకు గురైంది అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తాజాగా జెమినీ ఛానెల్ లో ఈ సినిమాను ప్రసారం చేశారు. తొలి ఎయిరింగ్ లోనే ఈ మూవీకి కేవలం 2.95 టీఆర్పీ వచ్చింది. దీంతో ఈ సినిమాను బుల్లితెర వీక్షకులు పట్టించుకోలేదనే విషయం స్పష్టమైంది.

First Published:  21 Aug 2022 7:50 AM
Next Story