Telugu Global
Cinema & Entertainment

Ashok Galla | మరో సినిమా పూర్తిచేసిన అశోక్ గల్లా

Ashok Galla - హీరో అశోక్ గల్లా మరో సినిమా పూర్తిచేశాడు. త్వరలోనే ప్రచారం ప్రారంభిస్తాడు.

Ashok Galla | మరో సినిమా పూర్తిచేసిన అశోక్ గల్లా
X

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ 'దేవకి నందన వాసుదేవ' లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్.

హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించాడు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌ పై తొలి ప్రయత్నంగా సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై టీజర్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ అల్బం ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన ఏమయ్యిందే, జై బోలో సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరించి మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

రసూల్ ఎల్లోర్‌తో పాటు ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. వారణాసి మానస హీరోయిన్. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో చాలా గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

First Published:  11 Jun 2024 5:38 PM GMT
Next Story