Ashish Vidyarthi: హీరోలపై అదిరిపోయే పంచ్ వేసిన ఆశిష్ విద్యార్థి
Ashish Vidyarthi Dream roles - డ్రీమ్ రోల్స్ అనే కాన్సెప్ట్ వేస్ట్ అంటున్నాడు ఆశిష్ విద్యార్థి. హీరోలు, హీరోయిన్లకు డ్రీమ్ రోల్స్ అనే ఆలోచనలు ఉండకూడదని చెబుతున్నాడు.
"మీ డ్రీమ్ రోల్ ఏంటి?" హీరోహీరోయిన్లు ఎవరు ఎదురుపడినా మీడియా అడిగే కామన్ క్వశ్చన్ ఇది. దీనికి సదరు హీరోలు, హీరోయిన్లు కూడా సుదీర్ఘంగా సమాధానం చెబుతుంటారు. బాలకృష్ణ లాంటి నటులైతే పెద్ద లిస్ట్ చెబుతుంటారు. హీరోయిన్లు చాలామంది తమ డ్రీమ్ రోల్స్ చెబుతుంటారు.
ఇలాంటి వాళ్లందరికీ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు క్యారెక్టర్ ఆర్టిస్టు ఆశిష్ విద్యార్థి. డ్రీమ్ రోల్ అనే కాన్సెప్ట్ నటీనటులకు ఉండకూడదంటున్నాడు ఈ నటుడు. అలాంటి డ్రీమ్ రోల్ రచయిత బుర్ర నుంచి రావాలంటున్నాడు. ఇంకా ఏమన్నాడంటే...
"డ్రీం రోల్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. తర్వాత చేయబోయే పాత్రే డ్రీమ్ రోల్ గా భావిస్తాను. సినిమా అనేది దర్శకుడు, రచయిత కి సంబధించినది. నిర్మాత ఆ కలని నిజం చేస్తాడు. దీనికి నటులు తోడౌతాడు. మంచి పాత్ర రావాలంటే అది దర్శకుడు, రచయితపైనే ఆధారపడి ఉంటుంది. నా వరకూ అన్ని రకాల పాత్రలు చేయాలనీ ఉంది. మొదట్లో చాలా వరకూ విలన్ రోల్స్ చేశాను. ఇప్పుడు నేను కోరుకునే పాత్రలు, సెంట్రల్ రోల్స్ చేయాలని వుంది. దర్శక రచయితలకు ఓ మంచి పాత్రని అడగడానికి నాకు మొహమాటం ఉండదు. ఐతే వాళ్ళు మంచి పాత్రని ఇవ్వాలంటే అది మనం చేయగలమని వాళ్లకు నమ్మకం కల్పించడం మన బాధ్యత."
ఇలా డ్రీమ్ రోల్స్ అనే టాపిక్ పై అదిరిపోయే రిప్లయ్ ఇచ్చాడు ఈ సీనియర్ ఆర్టిస్టు. తెలుగులో తక్కువగా సినిమాలు చేస్తున్న ఈ నటుడు, అవకాశం వస్తే ఏ పాత్రనైనా పోషిస్తానని, అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని అన్నాడు. రిలీజ్ కు రెడీ అయిన రైటర్ పద్మభూషణ్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు ఆశిష్ విద్యార్థి.