Anupama Parameswaran | న్యూ ఇయర్ లో షాకిచ్చిన అనుపమ
Anupama Parameswaran - సంప్రదాయబద్దంగా కనిపించే అనుపమ పరమేశ్వరన్, కొత్త ఏడాది సందర్భంగా హాట్ గా ముస్తాబైంది.

అనుపమ పరమేశ్వరన్... ఈ పేరు చెప్పగానే ముగ్దమనోహర రూపం దర్శనమిస్తుంది. క్యూట్ ఫేస్, రింగుల జుట్టు, అందమైన చిరునవ్వు.. ఓ పక్కింటమ్మాయి అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇకపై అనుపమలో అల్ట్రా గ్లామరస్ లుక్ కూడా చూడబోతున్నాం. దానికి సంబంధించి తాజాగా పోస్టర్ రిలీజైంది.
టిల్లూ స్క్వేర్ పోస్టర్‌లో అనుపమ చాలా హాట్‌గా కనిపిస్తోంది. వెస్ట్రన్ వేర్ ధరించిన అనుపమ, హీరో సిద్ధు జొన్నలగడ్డపై కూర్చున్న రొమాంటిక్ స్టిల్ ను విడుదల చేశారు. అనుపమను ఈ కోణంలో చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇన్నాళ్లూ ఆమెకున్న ఇమేజ్ వేరు. దానికి భిన్నంగా ఈ స్టిల్ వచ్చింది.
నిజానికి ఈ సినిమాలో ఆమె నటించడానికి అంగీకరించినప్పుడే కాస్త మేకోవర్ ఊహించారు జనం. ఎందుకంటే.. డీజే టిల్లు లో నటి నేహాశెట్టి, రాధిక క్యారెక్టర్ లో మెరుపులు మెరిపించింది. దాన్ని మ్యాచ్ చేయాలంటే అనుమప ఈమాత్రం చేయాల్సిందే.
ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన మొదటి సింగిల్‌లో కూడా ఆమె హీరోతో లిప్ లాక్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందింస్తున్నాడు. సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది.