Anupama Parameswaran | కోలీవుడ్ పై కన్నేసింది
Anupama Parameswaran - ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుపమ పరమేశ్వరన్, కోలీవుడ్ పై కన్నేసింది.

అనుపమ పరమేశ్వరన్.. సాంప్రదాయ పాత్రలతో ఫేమస్ అయింది. తన రింగుల జుట్టుతో, ఆకర్షణీయమైన రూపంతో హోమ్లీ పాత్రలు చాలానే చేసింది. అయితే ఈమధ్య ఈ ముద్దుగుమ్మ రూటు మార్చింది. కాస్త హాట్ గా ఉండే పాత్రలకు కూడా ఓకే చెబుతోంది. టిల్లూ స్క్వేర్ లో ఆమె క్యారెక్టర్ చూసి చాలామంది షాక్ అయ్యారు.
సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ఆమె నటించిన తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ విడుదలకు సిద్ధమైంది. అందులో అనుపమ అందాలు, లిప్ కిస్సులు చూసేందుకు చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఇలాంటిదే మరో హాట్ చిత్రంలో నటించడానికి అనుపమ ఓకే చెప్పింది.
ఈసారి అది తమిళంలో కావడం విశేషం. సెల్వరాజ్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించబోతున్నాడు. సీనియర్ నటుడు విక్రమ్ కొడుకు, ధృవ్ సరసన అనుపమ కథానాయికగా నటించనుంది. కబడ్డీ ప్లేయర్ మానతి గణేష్ జీవితం ఆధారంగా ఈ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, పా రంజిత్‌కి చెందిన నీలం స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.