కిరోణ్‌తో పెళ్లిపై అనుపమ్ ఖేర్ ఆసక్తికర వ్యాఖ్యలు
వైవాహిక జీవితంలో కిరోణ్ ఎదుర్కొన్న ఇబ్బందులు తనకు తెలుసన్న బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన పర్సనల్ లైఫ్ గురించి ఇంటర్వ్యూల్లో అరుదుగా మాట్లాడుతుంటారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన కిరోణ్‌తో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కిరోణ్‌కు గౌతమ్ అనే వ్యక్తితో మ్యారేజ్ అయ్యిందని.. వైవాహిక జీవితంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు తనకు తెలుసు అన్నారు.
కాలేజీలో కిరోణ్ నా సీనియర్. సుమారు 12 ఏండ్లు మేము స్నేహితులుగా ఉన్నాం. స్టడీస్‌లో ఆమె ఎప్పుడూ ముందుండేది. గొప్ప నటి అని కొనియాడారు. ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా అని చెప్పారు. చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లో రాణించాలనే ఉద్దేశంతో నేను ముంబాయి వచ్చాను. ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అదే సమయంలో కిరోణ్‌కు గౌతమ్ బెర్రీతో మ్యారేజ్ జరిగింది. పెళ్లి తర్వాత ఆమె కూడా ముంబయిలోనే స్థిరపడింది. నేను, సతీశ్ కౌశిక్ అప్పుడప్పుడు వాళ్లింటికి భోజనానికి వెళ్తుండేవాళ్లం. మా ఇబ్బందులు తెలిసి.. ఆమె మాకు కొంత డబ్బు ఇచ్చేది. కొంతకాలానికి ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురయ్యాయి. నేనూ ఒక అమ్మాయి వల్ల చేతు అనుభవం చవిచూశాను. మా మధ్య స్నేహం ప్రేమగా మారింది. అది పెళ్లికి దారితీసిందని అనుపమ్ ఖేర్ చెప్పారు. నటిగా సినీ ప్రియులకు పరిచయమైన కిరోణ్ రావు.. రాజకీయాల్లోనూ రాణించారు. ఎంపీగా పనిచేశారు.